- అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
- పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.
అంబేద్కర్ బలహీన వర్గాల దేవుడన్నారు. అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న బీజేపీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిది బ్లాక్‌మెయిల్ కల్చర్ కాదన్నారు. మోదీకి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యమన్నారు. కులగణన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని వీహెచ్ నిలదీశారు.