calender_icon.png 23 December, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో యువకుడిపై దారుణం

23-12-2024 01:35:20 AM

* ఉమ్మివేసి దాడి.. ఆపై వీడియో రికార్డింగ్

ముజఫుర్‌పూర్, డిసెంబర్ 22: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారు ణం జరిగింది. ఈ నెల 16వ తేదీన స్థానిక ఎంఎస్‌కేబీ కాలేజీ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఉమ్మివేసి దాన్ని నబీ హసన్ అనే యువకుడితో బలవంతంగా నాకించారు. తర్వాత ఈ తతంగాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కాగా తాజాగా బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సైఫ్, ఇమ్రా న్, మహ్ఫూజ్‌లతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు నమోదు చేశారు. నబీ చేత బలవంతంగా సిట్ అప్‌లు తీయించినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. దాడి సమయంలో అనేక మంది అక్కడ గుమ్మిగూడినా ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలే దు. దాడి చేసిన వ్యక్తులు 15 రోజుల్లో బాధితుడిని చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.