calender_icon.png 3 April, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం మెగా డీమార్టులో దారుణం

01-04-2025 10:09:30 PM

చాక్లెట్ తిన్నాడన్న అక్కాసుతో బాలుడిని చితకబాదిన యజమాని..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మెగా డీమార్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలియక చేసిన తప్పుకు నరకం చూపిన యాజమాన్యం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మంచాల రోడ్ లో ఉన్న మెగా డీమార్ట్ లోకి వచ్చిన ఓ బాలుడు చాక్లెట్ తిన్నాడన్న అక్కాసుతో మెగా డీమార్ట్ యజమాని ఆ బాలుడిని చితకబాదినట్లు తెలిపారు. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు మెగా డిమార్ట్ యాజమాన్యం, బాలుడిని రూమ్ లో నిర్బంధించారు. స్థానికుల సమాచారంతో కదిలిన పోలీస్ యంత్రాంగం. బాలుడిని చిత్ర హింసలకు గురిచేసిన మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి మెగా డీమార్ట్ ని మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.