బంగ్లాదేశ్ ఘటనపై కాగజ్ నగర్ లో ర్యాలీ
హాజరైన హిందూ ఐక్యవేదిక కన్వీనర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే హరీష్ బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను వెంటనే ఆపాలని ఎమ్మెల్యే హరీష్ బాబు, హిందూ ఐక్యవేదిక కన్వీనర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులైన మహిళలపై దాడులు చేయడమే కాకుండా హత్యలు దోపిడీలు చేస్తూ అవమానియా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అక్కడి ప్రభుత్వం వాటిని అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఆరోపించారు. మైనార్టీ హిందువులకు మద్దతు పలుకుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహావీర్ ప్రసాద్ లోయ, ఐక్య వేదిక కో కన్వీనర్లు కొంగ సత్యనారాయణ, కాళిదాస్, ముజేందర్, హనుమంతరావు, బజరంగ్దళ్ కన్వీనర్ శివ గౌడ్, రిటైర్డ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు శివ, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి, ఐక్యవేదిక సభ్యులు ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, హిందూ నాయకులు పాల్గొన్నారు.