calender_icon.png 12 January, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక ప్రాంతంగా ఏటీఆర్

03-10-2024 12:49:26 AM

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర 

అచ్చంపేట, అక్టోబర్ 2: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) కేంద్రాన్ని రాష్ట్రంలోనే అత్యంత వైభవమైన పర్యాటక ప్రాం తంగా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.

స్వామిరావికి తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరిగి నల్లమలలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ యాత్రను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. పర్యాటకుల కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సఫారీ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.