calender_icon.png 26 December, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీఎం దొంగ అరెస్టు

03-11-2024 01:42:47 AM

నిర్మల్, నవంబర్ 2 (విజయక్రాం తి): నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల కెనరా బ్యాంకు ఏటీఎంలో ఉన్న నగదును దోచుకునేం దుకు యత్నిస్తున్న నిందితుడిని శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ లోనికి ప్రవేశిస్తుండగా స్థానికులు గమనించి డయల్ 100 కు సమాచారమిచ్చారు.

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై కుమార్ సిబ్బందితో అక్కడికి వెళ్లగా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడ్ని పోలీసులు బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. నిందితుడిని సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.