05-03-2025 12:26:38 AM
కాలి బూడిదైన 7 లక్షల నగదు
ఏటీఎం మిషన్ కూడా ధ్వంసం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
రాజేంద్రనగర్, మార్చి 4 (విజయ క్రాంతి): ఏటీఎంలో డబ్బుల చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు నగదు రాకపోవడంతో ఏటీఎం మిషన్కు నిప్పు పెట్టడంతో ఏడు లక్షల నగదు కాలి బూడిద అయింది. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీ వద్ద ఉన్న ఎస్బిఐ ఏటీఎంలోకి ఆదివారం రాత్రి చొరబడిన దొంగల ముఠా నగదు చోరీకి విఫలయత్నం చేసింది. దీంతో ఏటీఎం మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నించి విఫల మయ్యారు. అనంతరం దుండగులు పెట్రో ల్ పోసి మిషన్కు నిప్పంటించారు.. మంట ల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిద అయ్యాయి. నిర్వాహకులు ఆల స్యంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం ఇన్‌స్పెక్టర్ నరేందర్ పేర్కొన్నారు. ఎస్‌ఓటి పోలీసులు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.