04-03-2025 09:55:29 AM
కాలి బూడిదైన 7 లక్షల నగదు
ఏటీఎం మిషన్ కూడా ధ్వంసం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ఏటీఎంలో డబ్బుల చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు నగదు రాకపోవడంతో ఏటీఎం మిషన్ కు నిప్పు పెట్టడంతో ఏడు లక్షల నగదు కాలి బూడిద అయింది. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్(Mailardevpally Police Station) పరిధిలోని మధుబన్ కాలనీలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీ వద్ద ఉన్న ఎస్బిఐ ఏటీఎంలోకి ఆదివారం రాత్రి చొరబడిన దొంగల ముఠా నగదు చోరీకి విఫలయత్నం చేసింది. దీంతో ఏటీఎం మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం దుండగులు పెట్రోల్ పోసి మిషన్కు నిప్పంటించారు.. మంటల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిద అయ్యాయి. నిర్వాహకులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం ఇన్స్పెక్టర్ నరేందర్ పేర్కొన్నారు. ఎస్ఓటి పోలీసులు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.