calender_icon.png 12 December, 2024 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ ఫక్కీలో ఏటీఎం చోరీ

11-07-2024 12:30:39 AM

ఏటీఎం మిషన్‌తో పాటు వాహనాన్ని వదిలివెళ్లిన దొంగలు

పోలీసులు వెంబడించడంతో బైకులు చోరీ చేసి పరార్

మహారాష్ట్ర దొంగల పనై ఉంటుందని పోలీసుల అంచనా

కామారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈ నెల ౯న జరిగిన ఏటీఎం చోరీ కేసు సినీ ఫక్కీని తలపిస్తున్నది. ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గ్రహించి వాహనాన్ని, ఏటీఎం యంత్రాన్ని అక్కడే వదిలి నగదుతో ఉడాయించినట్టు తెలిసింది. రెండు బైకులను చోరీ చేసి పరార్ అయినట్టు పోలీసులు గుర్తించారు. బిచ్కుందలో జాతీయ రహదా రి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంను మంగళవారం తెల్లవారు జామున దోపిడీ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. బిచ్కుంద సమీపంలోని కమ్మరి చెరువు ప్రాంతంలో ఏటీఎం మిషన్‌ను వదలి వెళ్లా రు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.

క్వాలిస్ వాహనంలో నలుగురు దొంగలు ఎస్బీఐ ఏటిఏం మిషన్‌ను చోరీ చేశారని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి వరకు దొంగల ఆచూకీ లభించలేదు. కాగా, దొంగలు ఉపయోగించిన వాహనం మహరాష్ట్ర సరిహద్దులో పోలీసులకు కన్పించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్‌కు చేరుకొని గుల్లా ప్రాంతం వద్ద వారు తెచ్చిన క్వాలిస్ వాహనం వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దుండగులు పెద్దఎడ్గి గ్రామం లో రెండు బైక్‌లను చోరీ చేసి వాటిపై పరారైనట్టు గుర్తించారు. కాగా, దొంగలు ఉప యోగించిన క్వాలిస్ వాహనం కూడా చోరీకి పాల్పడినదే అయి ఉంటుందని భావిస్తున్నా రు. మహారాష్ట్ర దొంగల ముఠా సరిహద్దులోని బిచ్కుందలో ఏటిఏంను చోరీ చేసు కొని వెళ్లే వరకు జాతీయరహదారిపై పెట్రోలింగ్ పోలీసులు ఏంచేశారో వారికే తెలి యాలి. దొంగల ముఠా వాహనాలు చోరీ చేస్తూ ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లి పోలీసులకు సవాల్ విసిరారు.

మహారాష్ట్రకు రెండు పోలీసుల బృందాలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏటీఎం మిషన్ చోరీ దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారు లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బిచ్కుంద శివారులో దుండగులు ఉపయోగించిన వాహనంతోపాటు ఏటీఎం యం త్రం లభించడంతో దొంగలు మహారాష్ట్ర వైపు పారిపోయినట్టు భావిస్తున్నారు. వారి ని పట్టుకునేందుకు మహారాష్ట్రకు ప్రత్యేకంగా రెండు బృందాలను జిల్లా పోలీస్ అధికారులు పంపించినట్టు సమాచారం.