calender_icon.png 3 March, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూమర్స్ జోరు

02-03-2025 12:46:31 AM

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కొద్ది రోజుల పాటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోపై ప్రచారం బీభత్సంగానే జరిగింది. అయితే ఆ సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో దర్శ కుడు అట్లీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇప్పుడు వీరిద్దరి కాంబో చిత్రంపై రూమర్స్ ఓ రేంజ్‌లో వినిపి స్తున్నా యి. ఈ సినిమా రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుందట.

అటు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్, ఇటు ‘జవాన్’తో అట్లీ నేషనల్ లెవల్లో తమ క్రేజ్‌ను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానిని ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు అట్లీ హై ఓల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సైతం సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడట. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రమనేది ఒక ఎత్తయితే.. వీరిద్దరి రెమ్యూనరేషన్స్ మరో ఎత్తు. అల్లు అర్జున్ రూ.250 కోట్లు తీసుకోనున్నాడని.. అట్లీ రూ.100 కోట్లు తీసుకోనున్నారని టాక్. మొత్తానికి బడ్జెట్‌లో వీరి రెమ్యూనరేషనే సగానికి పైగా వీరిద్దరి రెమ్యూనరేషన్లకే పో తుందని సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.