calender_icon.png 20 September, 2024 | 2:24 PM

సినిమా ఫక్కీలో చోరీ వీడియో వైరల్

20-09-2024 11:46:06 AM

అట్లాంటా: అమెరికాలోని  అట్లాంటాలో సినీ ఫక్కీలో జరిగిన ఒ చోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఓ దుకాణంలో చోరీకి వచ్చిన  ఇద్దరు దుండగులు ముందుగా షాపు సీలింగ్ లోకి  ప్రవేశించారు. దుకాణంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిన నడుచుకుంటూ వస్తూండగా హఠాత్తుగా సీలింగ్ బద్దలు కొట్టుకుని కిందికి దూకారు. ఎకాయెకిన జరిగిన ఈ హఠాత్పరిణామంతో  ఆ మహిళ భయబ్రాంతులకు గురైంది.  ఒక దుండగుడు ఆమెను బెదిరిస్తూండగా మరో దుండగుడు సైతం సీలింగ్ నుంచి కిందకు దూకాడు. వీరు ఇద్దరూ కలిసి ఆమెను బెదిరించి ఓ గదిలోకి తీసుకెళ్లి.. అక్కడ ఉన్న సేఫ్ ను తెరిపించి అందులోని నగదును తమ బ్యాగ్ లోకి సర్దుకున్నాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే టేపులతో బంధించి దుండగులు తాపీగా డోర్ తీసుకుని బయటకు వెళ్లపోయారు. అట్లాంటా చెక్ క్యాషియర్స్ లో జరిగిన దోపిడీలో మెత్తం 1,50,500 డాలర్లు అపహరణకు గురయినట్లు తెలుస్తోంది. దుండగులను నల్ల జాతీయులుగా అనుమానిస్తున్నారు. కాగా దుండగులు చోరీ చేసి ఉడాయించిన వైనం సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం.