10-02-2025 12:27:09 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆదివారం రాజ్ నివాస్‌లో కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఓటమి చెందడంతో అతిశీ తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ ఓటమి చెందారు.
అయితే కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతిశీ మాత్రం బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై గెలుపొందారు. కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ.. ఆ బాధ్యతలు చేప ట్టిన మూడో మహిళగా గుర్తింపు పొందారు.