* వ్యాఖ్యానించిన కేజ్రీవాల్
* తప్పుబట్టిన ఎల్‌జీ సక్సేనా
* ఢిల్లీ సీఎం అతిషికి లేఖ
* ఘాటు రిప్లు ఇచ్చిన అతిషి
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో అర్చకులకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ప్రకటించిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. అతిషి కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి అని.. ఎన్నికల్లో గెలిచాక తాను తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతానని ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతిషిని తాత్కాలిక సీఎం అని అనడం ఆమెను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు అతిషికి లేఖ రాశారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య రాజ్యాంగ విలువలకు, సీఎం పదవి మర్యాదకు భంగం కలిగించడమే అవుతుందని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కేజ్రీవాల్ ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన ఆ కుర్చీలో అతిషిని కూర్చోబెట్టారు.
డర్టీ రాజకీయాలు మానేయ్..
లెఫ్టినెంట్ గవర్నర్ లేఖపై ఢిల్లీ సీఎం అతిషి ఘాటుగా స్పందించారు. ‘సక్సేనా డర్టీ పాలిటిక్స్ చేసే బదులు.. ఢిల్లీని బాగు చేయడం మీద దృష్టి పెట్టాలి’ అని అన్నారు.