calender_icon.png 23 February, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ శాసనసభ పక్ష నేతగా అతిశీ

23-02-2025 04:49:48 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ ని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆప్ శాసన సభాపక్ష భేటీని ఆదివారం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే సంజీవ్ ఝూ పేరును కూడా ప్రతిపాదించగా, అందరూ అతిశీకి మద్దతు పలికారు. కాల్ కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అతిశీ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఆప్ శాసన సభాపక్ష భేటీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తనపై విశ్వాసం ఉంచి, శాసన సభాపక్షనేతగా ఎన్నుకునందుకు కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్యేలకు అతిశీ ధన్యవాదాలు తెలియజేశారు.