కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అండర్ 14 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు సత్తా చాటింది. మూడు రోజులపాటు హోరాహోరీగా జరిగిన పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో హౌరా అనిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జట్టుపై అదిలాబాద్ జట్టు గెలిచి టోర్నమెంట్ ఛాంపియన్షిప్ గా నిలిచి క్రీడా పథకాన్ని ఎగరవేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
మొదటి నుండే ఉమ్మడి అదిలాబాద్ జట్టు ప్రత్యర్థి జట్లపై భారీ గోల్స్ తేడాతో చిత్తు చేస్తూ ఫైనల్ చేరి జయభేరి మ్రోగించింది. జట్టుకు కోచ్ లుగా వ్యవహరించిన అరవింద్, సాయి, స్ఫూర్తి, వివేక్ తో పాటు క్రీడాకారులను అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్ జి ఎఫ్ కార్యదర్శులు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనే శ్యాంసుందర్రావు, కనపర్తి రమేష్, జిల్లా ఒలంపిక్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, గిరిజన శాఖ డిడి రమాదేవి, గిరిజన స్పోర్ట్స్ అధికారి మీనారెడ్డి, క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు, కోచ్ లు పీడీలు అభినందించారు.