calender_icon.png 17 March, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి

16-12-2024 11:58:12 PM

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా క్రీడాకారులు జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన సీఎం కప్-2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కప్-2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల స్థాయిలో క్రీడ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 16 ఈవెంట్‌లలో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం కప్-2024 క్రీడల్లో జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది క్రీడాకారులు ఆటపోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. వారిలో 2 వేల మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. గెలుపోటములు కాకుండా క్రీడల్లో పాల్గొనడం అనేది ముఖ్యమన్నారు.

జిల్లా స్థాయి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభను కనబర్చాలన్నారు. జాతీయస్థాయి క్రీడాకారులకు ప్రోత్సహం అందిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి సానూకూలంగా ఉన్నారని, క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్‌ రెడ్డిలు మాట్లాడుతూ.. జిల్లాలోని 25 మండలాలకు చెందిన క్రీడాకారులు సీఎం కప్ క్రీడాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడల్లో ఆడి ఓడిన చింతించకూడదన్నారు. జిల్లా స్థాయి వరకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాకు సీఎం కప్ తీసుకురావాలని క్రీడాకారులను కొరారు. జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జగన్నాథన్, ఆర్డీవో రంగనాథ్‌రావు, వార్డు కౌన్సిలర్ వనిత రాంమోహన్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, పిజికల్ డైరెక్టర్స్, పిఈటిలు పలు అసోసియేషన్ల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.