అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ 2024 క్రీడా పోటీలలో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు సత్తా చాటారు. సీఎం కప్ 2024 లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు 86 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పథకాలు 12, వెండి పథకాలు 05, కాంస్య పథకాలు 11 సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించి, రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తెచ్చిన అథ్లెటిక్ క్రీడాకారులను, క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డిని, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, మహిళలలో ఆర్చరీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అభినందించారు.