19-09-2024 12:27:36 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బుధవారం పలువురు క్రీడాకారులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే క్రీడాకారుల ఎంపికలో అసోసియేషన్ సభ్యులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి క్రీడాకారులకు మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హెచ్‌సీఏ కమిటీని ప్రక్షాళన చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.