calender_icon.png 26 December, 2024 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయీ శతజయంతి వేడుకలు

25-12-2024 02:34:58 PM

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయీ చిత్రపటానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంపీ లక్ష్మణ్ నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వాజ్ పేయీ శతజయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులను కిషన్ రెడ్డి సన్మానించారు. నైతిక విలువలతో రాజకీయాలు నడిపిన గొప్ప వ్యక్తి వాజ్ పేయీ అని లక్ష్మణ్ కొనియాడారు. వాజ్ పేయీ శతజయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని బండి సంజయ్ వెల్లడించారు. రాజకీయ నాయకులకు, యువకులకు వాజ్ పేయీ జీవితం ఎంతో ఆదర్శమని కిషన్ రెడ్డి తెలిపారు. వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కిషన్ రెడ్డి పండ్లు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటూ తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2:00 గం.లకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టింది. కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా నిర్వహించబడుతున్న కార్యక్రమంలో పాల్గొని, భారత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారి వాజ్‌పేయి స్ఫూర్తిని కొనసాగిద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.