10-04-2025 01:53:45 AM
ఆల్ఫోర్స్ విద్యార్థికి 3వ ర్యాంక్
కరీంనగర్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో విద్యార్థి జాతీయ స్థాయి యునిఫైడ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో ఆల్ ఇండియా 3 వ ర్యాంకు సాధించాడు.
సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో పాఠశాలకు చెందిన ఎం. శీవేన్ రెడ్డి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడంతో పాటు 10,000 రూపాయల నగదు బహుమతిని గెల్చుకోవడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ విజేతకు ప్రశంసా పత్రం బహుకరించారు. భవిష్యత్లో మరిన్ని ఆదర్శనీయమైన విజయాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు.