- కూరగాయలు పండిస్తున్న పక్క ప్లాట్ ఓనర్
- చుట్టూ ప్రహరీ నిర్మించి నిచ్చెనతో అటు-ఇటు సాగు
- మేయర్ ఆదేశాలతో ప్రహరీ, మొక్కల తొలగింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని జీహెచ్‌ఎంసీకి చెం పార్కు స్థలంలో అనుమతు లేకుండా కూరగాయలు పండిస్తున్న పక్క ప్లాట్ ఓనర్‌పై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో కలిసి సంబంధిత పార్కును ఆమె పరిశీలించారు.
పార్కు స్థలం జీహెచ్‌ఎంసీ బోర్డును పక్క ప్లాట్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి తొలగించడంతో పాటు పార్కుకు సమాంతరంగా ప్రహరీ నిర్మించి నిచ్చెన వేసుకొని నిత్యం పార్కులోకి దిగి ఖాళీ స్థలంలో కూరగాయలు పండించుకుంటున్నాడు.
మేయర్ ఆదేశాల మేరకు పార్కు స్థలంలో ఉన్న కాంపౌండ్‌వాల్‌ను, పార్కులోని కూరగాయల మొక్కలను అధికారులు తొలగించారు. అనంత జూబ్లీహిల్స్ సర్కిల్ వెంకటేశ్వరనగర్ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు.