calender_icon.png 20 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరేళ్లు పూర్తయిన వేళ..

04-08-2024 12:46:09 AM

అడవి శేష్ హీరోగా నటించిన ‘గూఢాచారి’ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది. ‘జీ2 గూఢాచారి2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వినయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థల ద్వారా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రీక్వెల్ విడుదలై ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీక్వెల్ ‘జీ2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా సినీ అభిమానులతో శనివారం పంచుకున్నారు అడవి శేష్. మొదటి భాగం ఇండియాలో జరగ్గా, పార్ట్ అంతర్జాతీయంగా ఉండనుంది. అయితే, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.