calender_icon.png 9 January, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీ అధికారుల ఇష్టారాజ్యం

17-10-2024 12:00:00 AM

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొందరు అధికారులు వేరే చోటుకు బది లీ అయి నెలలు గడుస్తున్నా పాత స్థానాలను వీడకుండా మొండి కేయడం విచారకరం. ఇది వారి ఇష్టారాజ్య లక్షణాన్ని చాటుతున్నది. ఇలాంటి ధోరణి ఒక్క జీహెచ్‌ఎంసీకే పరిమితం కాదు. నిజానికి ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, ఇంకా టీచర్లు సైతం తమ కు బాగా అలవాటు పడిన, సౌకర్యవంతమైన స్థానాలలో పాతుకు పోవడం అత్యంత సహజమైపోతున్నది.

ఇది అవాంఛనీయం. ఉన్నతాధికారులు కూడా అలాంటి వారిపై ఎలాంటి చర్యలకూ ధైర్యం చేయకపోవడం ఆశ్చర్యకరం. ‘ఆ అధికారుల తీరే వేరు’ అంటూ ‘విజయక్రాంతి’లో వచ్చిన ప్రత్యేక వార్తాకథనం హైదరాబాద్ బల్ది యాలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం దుస్థితిని కళ్లకు కట్టిం ది. ఇంకా, విస్మయకరమైన విషయమేమింటే, కొందరు ఐఏఎస్‌లు సైతం బదిలీలపై పొరుగు రాష్ట్రాలకు వెళ్లమని, హైదరాబాద్‌లోనే ఉంటామంటూ పోరాటాలకు సైతం దిగడం దురదృష్టకరం.

 డి.ఎస్.కుమార్, బెంగళూర్