21-03-2025 12:57:43 AM
కూసుమంచి , మార్చి 20:- కూసుమంచి మండల కేంద్రంలోని పురాతన శివాలయం గణపేశ్వారాలయంలో అద్భుతం చోటు చేసుకుంది.. గురువారం సూర్యోదయం సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోని శివలింగం మీద పడడంతో ఆలయ విశిష్టతను తెలియజేస్తుంది.
గర్భాలయంలోని శివలింగం మీద నేరుగా సూర్యకిరణాలు పడడం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది.. ఈ ఆలయం కాకతీయ రాజు గణపతి దేవుడి హయంలో కట్టబడినది.. ఈ శివాలయంలోని శివలింగ దక్షణ భారత దేశంలోనే రెండవ అతిపెద్ద శివలింగంగా ప్రసిద్ధి..