calender_icon.png 17 January, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టులో..

03-09-2024 04:10:15 AM

ప్రైవేట్ విమానాల కోసం ఏవియేషన్ టెర్మినల్ ఏర్పాటు

రాజేంద్రనగర్, సెప్టెంబర్2: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ప్రైవేట్ జెట్ యజమానులు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొం దించిన అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాపా ర లేదా వ్యక్తిగత ప్రయాణానికి ఉద్దేశించిన చార్టెడ్ విమానాల ద్వారా ప్రయాణించే ప్ర యాణికుల విభిన్న అవసరాలను సులభతరం చేయడమే కొత్త టెర్మినల్ ప్రధాన ఉద్దేశ మని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రీమియం జన రల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అల్ట్రా విలువ కలిగిన వ్యక్తులు, అభివృద్ధి చెందుతున్న ఫార్మాస్యూటికల్, ఐటీ పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కేంద్రాల్లో హైద రాబాద్ ఒకటిఅని అన్నారు. ఆర్‌జీఐఏ టెర్మినల్ పక్కన 11,234 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జీఏ టెర్మినల్‌లో ప్రైవే ట్ ప్రవేశద్వారం, పార్కింగ్ వసతులను ఏర్పా టు చేసినట్లు వివరించారు. ఇందులో అన్ని సదుపాయాలను తీర్చిదిద్దినట్లు వివరించారు.