19-04-2025 01:23:13 AM
ముదిరాజ్ బిడ్డలకు పరిపూర్ణమైన నాయకత్వ ఉంది
మేలుకోసమే రైతు దగ్గరికి కొనుగోలు కేంద్రాలు
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : ప్రతి ఇంటిలో ఒక్కరైనా ఉన్నత స్థానంలో ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం అగ్నిమాపక భద్రత వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, హన్వాడ మండలంలో పిడబ్ల్యుడి రోడ్డు నుంచి దొర్రి తండా వరకు రూ 2.24 కోట్ల తో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రాములు అనే లబ్ధిదారుల ఇంట్లో సన్న భువన్తో కూడిన భోజనం చేయుట, ఎదిర రైతు వేదిక దగ్గర వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం, బస్టాండ్ లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం పరిశీలన, పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ముదిరాజ్ సంఘం భవనంలో ఏర్పాటుచేసిన సంఘం సమావేశానికి ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.
ముదిరాజులలో ఎంతోమంది ఉన్నత శిఖరాలలో ఉన్నారని, ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. ముదిరాజులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు ఎన్ పీ వెంకటేష్, మైత్రి యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, గోనెల శ్రీనివాస్, పండుగ సాయన్న సామాజిక సంఘం అధ్యక్షులు క్రిష్ణ ముదిరాజ్, జిల్లా కలెక్టరేట్ ఎఓ శంకర్, మహేందర్ ముదిరాజ్, విజయ్ బాబు, దోమ పరమేశ్వర్, గంజి వెంకన్న, రామకృష్ణ, గణేష్, బండి మల్లేష్, రామాంజనేయులు, ఎన్.శ్రీనివాస్ , లక్ష్మన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.