హైదరాబాద్,(విజయక్రాంతి): 76వ భారత గణతంత్ర దినోత్సవం(76th Republic Day) సందర్భంగా రాజ్ భవన్(Raj Bhavan)లో ఎట్ హోం కార్యక్రమం(At Home Program) నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ఇచ్చే తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హాజరయ్యారు. సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ పాల్గొన్నారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day), గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకల గురించి వివరించారు. మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ స్థిరమైన పట్టణ రవాణాను నిర్ధారిస్తుందని, వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం కనెక్టివిటీ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళతాయన్నారు.