calender_icon.png 23 December, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోత్స్న రికార్డు స్వర్ణం

21-12-2024 12:56:43 AM

దోహా: ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ వెయిట్‌లిఫ్టర్ జ్యోత్స్న సబర్ రికార్డు స్వర్ణంతో మెరి సింది. బాలికల 40 కేజీల కేటగిరీలో జ్యోత్స్న 135 కేజీలు ( స్నాచ్‌లో 60 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కేజీలు) ఎత్తి పసిడి సొంతం చేసుకుంది. ఇక 45 కేజీల యూత్ గర్ల్స్ విభాగంలో పాయల్ స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 85 కేజీలు.. మొత్తంగా 155 కేజీలు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ పాయల్ కాంస్యం గెలుచుకుంది. ఇక 49 కేజీల యూత్ బాలుర విభాగంలో బాబులాల్ 197 కేజీలు (88 స్నాచ్+ 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 4 పతకాలు వచ్చి చేరాయి. ఇక భార త్‌కు చెందిన ఆకాంక్ష వ్యవహారే 45 కేజీల జూనియర్ బాలికల విభాగంలో 151 కేజీలు ఎత్తి ఐదో స్థానంలో నిలవగా.. ఇక 45 కేజీల యూత్ గర్ల్స్ కేటగిరీలో ప్రీతిస్మితా భోయి 145 కేజీలు ఎత్తి 5వ స్థానంతో సరిపెట్టు కుంది.