calender_icon.png 9 May, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్య శిబిరం

08-04-2025 12:36:24 AM

గెలీరియా మాల్‌లో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అందరికీ ఆరోగ్యసేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం పంజాగుట్టలోని నెక్స్ గెలిరియా మాల్‌లో ఉచిత వైద్య శిబి రం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ శిబిరం కొనసాగింది.

450 మందికి పైగా ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు. జనరల్ ఫిజిషియన్లు డాక్టర్ సమీర, డాక్ట ర్ లావణ్య, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వైద్య సేవలు అందించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ దేవానంద్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ప్రారంభం తో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుం దన్న ది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ అన్నారు.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండానే చాలామందికి అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ఉంటున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికోసారి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయాని వీటిని ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అని తెలిపారు.