06-04-2025 12:00:00 AM
తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి.లచ్చిరెడ్డి
సిద్దిపేట, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో అమలులోకి రాబోతున్న భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ వీ లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆత్మీయ సమ్మేళనంలో లచ్చిరెడ్డి మాట్లాడారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్నిణం అవుతుందని వెల్లడించారు.
భూ భార తి చట్టంలో తహాశీల్దార్, ఆర్డీవో, ఆదనపు కలెక్టర్లకు అధికారాలు వికేంద్రికరణ జరుగుతుందని దాంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పా రు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రతకు త్వరలోనే ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకులంగా ఉందన్నారు. అప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న గ్రామ పరిపాలన అధికారి(జీపీవో) సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం జీపీవో పోస్టులను కోత్తగా సృష్టించిందని ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లు పదోన్నతులు ఉంటాయన్నారు. గ్రామానికి ఒక రెవె న్యూ ఉద్యోగి ఉండటం వలన భూ సమస్యలను తక్షణమే పరిష్కరించవచ్చని చెప్పారు.
61 సంవత్సరాల పైబడిన వీఆర్‌ఏలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలా కారుణ్య నియమకాలను చేప ట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను త్వరలోనే ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాలకు పంపిస్తుందన్నారు.
టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో చిన్నభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను మళ్లి ప్రభుత్వం పునర్నిర్నా ణం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాము లు, రమేశ్, పి.రాధ, సరిత, అశోక్, బిక్షం, రాంబాబు, సుజాత, ఉపేందర్, గీతా, సుదా, నిర్మాల, భవాని, స్వామి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.