calender_icon.png 11 October, 2024 | 11:42 PM

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక

11-10-2024 09:23:03 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం శుక్రవారం ఐడిఓసిలో నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ లింకు సిబ్బంది రష్మీ రంజన్ శెట్టి తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం పాల్వంచలోని ఐడిఓసిలో శిబిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుండాల, అశ్వరావుపేట, భద్రాచలం ప్రాంతాల్లో శిబిరాల పూర్తి చేసినట్లు తెలిపారు. పాల్వంచలో నిర్వహించిన శిబిరాల్లో 178 మంది తో కలిపి, మొత్తం 447 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్స్, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, అందులకు చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు, చంక కర్రల కోసం ఎంపిక చేయడం జరిగింది. ఈ సహాయ ఉపకరణాలు ఆలింకో నుంచి అందిన వెంటనే పంపిణీ చేయబడుతుందన్నారు.