30-03-2025 12:10:56 AM
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం విడుదల
హైదరాబాద్, మార్చి 29(విజయక్రాంతి): రాష్ర్టంలో గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం శనివారం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈమేరకు విపత్తు నిర్వహణ విభాగం ఆదేశాలు జారీ చేసింది.
పిడుగు పాటుతో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షలు, అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌సరెడ్డి తెలిపారు. భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఆరుగురు చొప్పు న, కుమ్రంభీమ్ జిల్లాలో నలుగురికి, హనుమకొండ జిల్లాలో ముగ్గురికి, నారాయణపేట్, జోగులాంబ, మహబూబాబా ద్, మెదక్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మిగతా జిల్లాల నుంచి ఒక్కొక్కరికి పరిహారం మంజూరైంది.
హైదరాబాద్‌రుబీహోటల్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.32 లక్షలు, రెడ్‌హిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన పదిమంది మృతుల కుటుంబాలకు రూ.40 లక్షలు విడుదల చేసింది.