అందజేసిన సూర్యాపేట కలెక్టర్
సూర్యాపేట, నవంబర్ 16: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి అనే విద్యార్థిని నీట్‌లో మంచి ర్యాంక్ పొంది ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అయితే ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది.
వీరిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య విద్యను అభ్యసించడం కష్టంగా మారింది. దీంతో విజయక్రాంతిలో ‘చదువుల తల్లిని కటాక్షించరూ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరిచారు.
దీంతో ప్రభుత్వం నుంచి రూ.లక్ష చెక్కు రాగా శనివారం కలెక్టరేట్‌లో ఆ చెక్కును విద్యార్థిని గౌతమికి అందజేశారు. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన గౌతమిని అభినందించి, వైద్య విద్యను పూర్తిచేసి పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. సాయమందించిన కలెక్టర్‌కు గౌతమి తాత కృతజ్ఞతలు తెలిపారు.