27-02-2025 07:28:13 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ పునరావాస అభివృద్ధి వికలాంగుల సంఘం చేయూతనందిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. గురువారం గాజులపేటకు చెందిన దివ్యాంగులు వెంకటేష్ స్కూటర్ తో తయారుచేసిన వ్యాపార బండిని ప్రారంభించారు. దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలదొక్కుకునే విధంగా సంఘం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ లింగన్న పాల్గొన్నారు.