calender_icon.png 20 April, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి

21-03-2025 01:45:09 AM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి20(విజయ క్రాంతి): స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని  కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 19.03.2025 వరకు ఆన్ లైన్ ద్వారా  సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి ఫారం 6,7,8 నంబర్లకు సంబంధించి  5481 దరఖాస్తులు వచ్చాయన్నారు.4559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వివరాలు సరిగ్గా లేని 369 తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో సలహాలు,  సూచనలు అందించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను అందించాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.