- ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేస్తాం
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, ఆగస్టు 6: హుజూరాబాద్ 100 పడకల ఆసుపత్రి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కళకళలాడిందని నేడు వెలవెలబో తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆసుపత్రి లో ఆరుగురు గైనకాలిస్టులు ఉండేవారని, నెలకు 200కుపైగా డెలివరీలు జరిగేవని అన్నారు. ప్రస్తుతం ఒకే ఒక గైనకాలజిస్టు ఉన్నారని, నెలకు 60 నుంచి 70 మాత్రమే డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో మాదిరిగా హుజూరాబాద్‌కు ఆరుగురు గైనకాలజిస్టులతోపాటు జమ్మికుంట కు ఇద్దరిని కేటాయించాలని కోరారు. గతం లో ఆర్థోపెడిక్ ఇద్దరు, జనరల్ సర్జన్లు ఇద్దరు ఉండేవారని చెప్పారు.
ఈఎన్‌డీ కూడా లేరన్నారు. అనస్థీషియా ఐదుగురు ఉండేవార ని, ప్రస్తుతం ఇద్దరే ఉన్నారని చెప్పారు. ఇంతమందిని బదిలీ చేస్తే ఆసుపత్రి ఎలా నడు స్తుందో చెప్పాలన్నారు. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి చొరవ తీసుకొని హుజూరాబాద్ ఆసుపత్రికి అవసరమయ్యే డాక్టర్లతో పాటు సిబ్బంది కేటాయించాలని కోరారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మం త్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఆసుపత్రిని సందర్శించాలని కోరారు.
ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయనవెంట స్థానిక నాయకులు ఉన్నారు.