calender_icon.png 21 January, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ అధీనంలో ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి

03-07-2024 12:28:54 AM

అందుకు అవసరమైన చర్యలు తీసుకోండి

అధికారులకు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

హైదరాబాద్, జూలై ౨ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న ఆర్‌అండ్‌బీ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకునాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమవుతున్న సందర్భంలో సచివాలయంలోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్‌బాగ్, కుందన్ బాగ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, గ్రీన్ ల్యాండ్స్, మంజీర అతిథి గృహం వంటి వివిధ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుగుణంగా పూర్తి సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్‌బీ శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, సీఈ మధుసూదన్ రెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.