calender_icon.png 21 April, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుల ఆస్తులు జప్తు

26-03-2025 11:44:42 PM

జూలూరుపాడు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరు గ్రామానికి దుగ్గెంపూడి శివ శంకర్ రెడ్డి, సారపాకకు చెందిన నాగేంద్రబాబు ఇద్దరు కలిసి నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ జూలూరుపాడు పోలీసులకు 2024, సెప్టెంబర్ 8వ తేదీన తారీఖున పట్టుబడడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టు నందు హాజరుపరిచారు. ప్రధాన నిందితుడైన దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి గంజాయి ద్వారా సంపాదించిన డబ్బులతో తన తండ్రి దుగ్గంపూడి వెంకటరెడ్డి పేరుమీద కోయగూడెం గ్రామపంచాయతీలో ఇల్లు కట్టించగా, తల్లి దుగ్గెంపూడి యశోద పేరుమీద AP-09-AZ 9868 అను నంబరు గల ఇన్నోవా కారు కొనుగోలు చేసాడు.

శివ శంకర్ రెడ్డికి హైదరాబాద్ గోకుల్ ఎక్స్ రోడ్ బ్రాంచ్ కెపిహెచ్బి ఎస్బిఐ బ్రాంచ్ నందు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటి ద్వారా లావాదేవీలను నడిపించడంతో గంజాయిని అక్రమ రవాణా చేసి సంపాదించిన డబ్బులతో ఆస్తులను కొనుగోలు చేసినందున వాటిని జప్తు చేయడానికి  జూలూరుపాడు సిఐ ఇంద్రసేనా రెడ్డి కాంపిటెంట్ అథారిటీ, చెన్నై ద్వారా ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకుని, దుగ్గెంపూడి శివ శంకర్ రెడ్డి గంజాయి ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులను, బ్యాంకు అకౌంట్ లను సీజ్ చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపించడమే కాక వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కృషి చేసిన జూలూరుపాడు సిఐని, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి ఆస్తులను కూడా జట్టు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.