వాస్తవానికి హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఇప్పుడున్న స్టార్ హీరోలతో అయితే హీరోయిన్ల రెమ్యూనరేషన్‌ను పోల్చలేం. రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలు సైతం ఉన్నారు. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు చూస్తే కళ్లు తిరుగుతాయి. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఆస్తులున్నాయి ఆమెకు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. జూహి చావ్లా.
ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లను వెనక్కు నెట్టి.. భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన సినీనటిగా జూహీ చావ్లా రికార్డ్ క్రియే ట్ చేశారు. సినీరంగంలో రూ.7300 కోట్ల ఆస్తులతో షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో ఉండగా.. జూహీ చావ్లా రూ.4600 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.
మూడో స్థానంలో రూ.2000 కోట్లతో హృతిక్ రోషన్, నాలుగో స్థానంలో రూ.1200 కోట్లతో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. సినిమాలకు కొంత కాలంగా జూహీ చావ్లా దూరంగా ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా నిర్మాతగా జూహీ కొనసాగుతున్నారు. అలాగే డ్రీమ్స్ అన్‌లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో జూహీ పార్టనర్.