* డీటీసీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జగిత్యాల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్‌తో పాటు అతడి బంధువుల ఇళ్లలో శుక్ర ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలకు చెందిన పుప్పాల శ్రీనివాస్ హనుమకొండలో డీటీసీగా పనిచేస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ స్వగ్రా జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జగిత్యాలకు చేరుకున్న అధికారుల బృందం పట్టణంలోని విజయపురి కాలనీలోని శ్రీనివాస్ ఇంటితో పాటూ బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి స్థిర, చరాస్తుల గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.