- అంతకుముందు క్యాబినెట్ సమావేశం
- కులగణన, ఎస్సీ రిజర్వేషన్లపై నివేదికలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- రెండు నివేదికలను ఆమోదించనున్న శాసనసభ
- కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన కులగణన సర్వేతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అసెంబ్లీ సమావేశా ల్లో చర్చించనున్నారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగ ళవారం ఉదయం 11 గంటలకు ప్రారం భం కానున్నాయి.
అంతకుముందు ఉద యం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే క్యాబినెట్ సమావేశంలోనూ సమగ్ర కులగణన సర్వేతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికకు ఆమోదం తెలుపనున్నారు. తెలంగాణలో ఏ కులం ఎంత జనాభా ఉందో తెలుసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం నియమించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ కూడా వేసింది.
ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి ఆయా వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ, సలహాలు, సూచనలు చేపట్టింది. దీంతో ప్రభుత్వం కూడా ఎన్యూమరేటర్లను నియమించగా ఇంటింటికి తిరిగి సర్వే చేపట్టారు. ఈ సర్వే నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఆదివారం అందజేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కులాల వారీగా ఎవరు ఎంత జనాభా ఉన్నదో సర్వే నివేదికలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తామని, అందుకు జనాభా లెక్కలను చేపట్టింది. కులగణన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపాలని, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది.
ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టుకు స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని అదే రోజు ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ నియమించడంతో పాటు విశ్రాంత న్యాయమూర్తి షమీమ్ ఆక్తర్‌తో ఏకసభ్య కమిషన్ నియమించారు.