calender_icon.png 19 April, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి

17-12-2024 02:00:46 AM

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజాసమస్యలను పరి ష్కరించేందుకు అసెంబ్లీ సమావేశాలు 30 రోజులపాటు నిర్వహిం చాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.  ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ సభ్యులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఆర్థిక వ్యవస్థ, పంచాయతీలకు పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ‘మేం కొట్టినట్టు నటిస్తాం.. మీరు ఏడ్చినట్టు చేయండి’ తరహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తీరు ఉందని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై చర్చ జరిగేంత వరకు బీజేపీ గొంతు వినిపిస్తూనే ఉంటుందన్నారు.