14-02-2025 03:06:33 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి(Damodaram Sanjivayya Jayanti) సందర్భంగా సంజీవయ్య పార్క్ లో ఆయన విగ్రహానికి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తదితర కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు పటేల్ రమేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, తదితరులు హాజరయ్యారు.