calender_icon.png 4 April, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

28-03-2025 01:56:14 AM

సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: స్పీకర్ 

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభా సమా వేశాలు గురువారంతో ముగిశాయి. ఉభయ సభలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. చివరి రోజు సభ్యులు శాసనసభతో పాటు శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమో దం తెలిపారు. అంతకు ముందు 202 4 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరి గింది.

అనంతరం ఆ పద్దులు ఆమో దం పొందాయి. అసెంబ్లీ సమావేశా లు 11 రోజుల్లో 97.32 గంటల పాటు సభ సాగగా, ప్రభుత్వం మొత్తం 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వాటన్నింటికీ సభ ఆమోదం సాధించింది. అసెంబ్లీ సమావేశాలు సజావు గా సాగేందుకు సహకరించిన అధికా ర, ప్రతిపక్ష, విపక్ష పార్టీ సభ్యులు, ఉద్యోగులు, పోలీస్, శాసనసభ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతిని ధులకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్  ధన్యవాదాలు తెలిపారు.