03-03-2025 01:01:53 AM
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిని ప్రోరోగ్ చేస్తున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ కార్యాలయం గెజిట్ విడుదలైంది. గతేడాది డిసెంబర్ 9న మొదలైన అసెంబ్లీ 22వ సెషన్‌ను మార్చి 1 నుంచి నిరవధిక వాయిదా వస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.
23వ సెష న్‌కు అసెంబ్లీ, మండలిని సమావేశపరిచేందుకు గవర్నర్ త్వరలో నోటి ఫికేషన్‌ను జారీ చేయనున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. అయితే.. వాటిని ప్రభుత్వం 22న సెషన్‌కు కొనసాగింపుగానే ప్ర భుత్వం నిర్వహించింది.
ఇప్పుడు మరోసారి బీసీలకు 42శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావించింది. గవర్నర్ ఉభయ సభలను ప్రోరోగ్ చేయడంతో ప్రభుత్వం మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు.
బడ్జెట్ కోసం గవర్నర్ త్వరలో ఉభయ సభలను సమావేశపరచున్నారు. ఇక రాష్ట్రప్రభుత్వం ఆ సమయంలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.