12-03-2025 12:38:08 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారం భం కానున్నాయి. ఉభయ సభల( శాసనసభా, మండలి)ను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు.
సభావాయిదా పడిన అనంతరం శాసనసభాపతి, శాసన మండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అం శంపై నిర్ణయం తీసుకోకున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాత్రం 12వ తేదీ నుంచి 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నారు.
ఈ నెల 19న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై సభలో ధన్యవాదాల తీర్మానం తెలపనున్నారు. ఇక 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణపై ఉభయసభల్లో చర్చించి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందని సమాచారం.
కాగా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు అవకాశం ఇవ్వకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పీకర్ ప్రసాద్‌కుమార్, మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు సిద్ధం..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభు త్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ సభ్యులు ప్రిపేర్ అవు తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమ లు చేయాలని సర్కార్‌ను నిలదీయాలనే ఆలోచనతో ఉన్నారు.
అయితే ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసిందని, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకెళ్లుతున్నామని సర్కార్ ఎదురుదాడికి దిగాలనే ఆలోచన చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించాలనే ఆలోచనతో ఉంది. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం చిన్నచూపు చూస్తోందని బీజేపీ సభ్యులను ఇరుకున పెట్టాలని అధికార పక్షం సిద్ధమవుతోంది. మొత్తం మీద అసెం బ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.
సీఎల్పీ సమావేశం..
అసెంబ్లీలోని కమిటీ హాల్ మధ్యా హ్నం ౨గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనస భాపక్ష సమావేశం సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహించనున్నారు.