calender_icon.png 15 November, 2024 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులపై దాడి దుర్మార్గం

15-11-2024 02:24:04 AM

టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు

హైదరాబాద్, నవంబర్14 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై  దాడులకు  పాల్పడడం దుర్మార్గమని తెలంగాణ  ఉద్యోగుల (టీజీఈజేఏసీ) జేఏసీ సెక్రెటరీ జనరల్  ఏలూరి  శ్రీనివాస రావు  పేర్కొన్నారు. రాజకీయ  లక్ష్యాల కోసం  భౌతిక దాడులకు  పాల్పడడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ జిల్లా  కలెక్టర్, ఇతర  ఉద్యోగులపై  దాడికి నిరసనగా  జేఏసీ,  ట్రెసా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన  పిలుపు మేరకు గురువారం  మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టారు.

ఈక్రమంలోనే నాంపల్లిలోని రాష్ట్ర భూపరిపాలన  కమిషనర్  కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరి మాట్లాడారు. కలెక్టర్, ఇతర  అధికారులపై దాడికి పాల్పడిన  వారితోపాటు తెర వెనుక నుంచి రెచ్చగొట్టిన వారిని సైతం  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీంద్రరెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నేత చంద్రమోహన్, టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు బి.శ్యామ్, కస్తూరి వెంకటేశ్వర్లు, తెలంగాణ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.