calender_icon.png 23 February, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్దురాలిపై అఘాయిత్యం

22-02-2025 01:18:16 AM

పెబ్బేరు, పిబ్రవరి 21: ఒక వ్యక్తి వృద్దురాలిపై అఘాయిత్యానికి పాలుపడిన సంఘ టన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సు హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెబ్బేరు మున్సిపాలిటీలోని చెలిమిళ్లకు చెందిన ఒక వృద్దురాలిని ఎరుకలి రాముడు మంగళవారం సాయంత్రం బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు.

కొల్లాపూర్ రోడ్డు పక్కల ఉన్న రామాలయం వెనుకాలోకి తీసుకువెళ్లి వృద్దురాలి నోరుమూసి అఘాత్యానికి పాలుపడుతున్నాడు. గమనించిన స్థానికులు వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అఘాయిత్యానికి పాలుడిన వ్యక్తి ని గురువారం కోర్టు ముందు హాజరుపర్చా రు. అఘాయిత్యానికి పాలుపడిన వ్యక్తికి న్యా యస్థానం 14రోజుల రిమాండ్ విధించింది.