కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు
నైరోబి: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా అథ్లెట్ రెబెక్కా చెప్టేగి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తాను నమ్మి వచ్చిన బాయ్‌ఫ్రెండ్ కిరోసిన్ పోసి రెబెక్కాను చంపాలనుకోవడం గమనార్హం. విషయంలోకి వెళితే.. కెన్యాకు చెందిన డిక్సన్ (35) అనే యువకుడితో రెబెక్కా సహజీవనం చేస్తోంది. ఇంటిస్థలం విషయమై ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
సహనం కోల్పోయిన డిక్సన్ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను రెబెక్కాపై పోసి నిప్పు అంటించాడు. తీవ్ర గాయాలపాలైన రెబెక్కాను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రెబెక్కా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెబెక్కాపై దాడిని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిస్టన్స్ రన్నర్ అయిన రెబెక్కా మొన్నటి పారిస్ ఒలింపిక్స్‌లో 44వ స్థానంలో నిలిచింది.