తుపాకీ పని చేయకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
టీఎంసీ నేతపై హత్యాయత్నం
తుపాకీ పని చేయకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
కోల్కత్తా, నవంబర్ 16: పశ్చిమ బెంగాల్లో ౌన్సిలర్ సుశా ంత్ ఘోష్‌పై హత్యా యత్నం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఘోష్ కోల్‌కత్తాలోని తన నివాసం ముందు కూర్చొని ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి ఆయనను కాల్చేందుకు ప్రయత్నించారు. తుపాకీ పని చేయకపోవడంతో ఘోష్ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో తేరుకున్న ఘోష్ తనను కాల్చేందుకు ప్రయత్నించిన ఒక నిందితుడ్ని స్థానికుల సహా యంతో వెంటాడి మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇందుకు సంబంధించి న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘోష్‌ను హత్య చేసేందుకు ఇక్బాల్ మహ్మద్ అనే వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చినట్టు పట్టబడ్డ నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి ఓ రివాల్వర్‌తో పాటు రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.